నిట్‌లో వర్క్‌షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఎంఎం.గంగేశ్వర్ పాల్గొన్నారు.


