‘కోట’ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
మమ్ముల్ని ఢీకొనడం చేతకాదు
ఖిలా వరంగల్: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చారిత్రక ఖిలా వరంగల్ కోటను మరింత అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగంగా రాతికోట చుట్టూ బోటులో పర్యాటకులు షికారు చేసేలా అగర్త చెరువు అభివృద్ధి, ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ రాతికోట ఉత్తర ద్వారం వద్ద ‘కుడా’ ఆధ్వర్యంలో రూ. 2కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘మోటు’ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయుల కట్టడాలను పరిరక్షిస్తూ విశిష్టతను భావితరాలకు అందజేస్తామని, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం 32,37,41 డివిజన్లలో మొత్తం రూ.4కోట్ల 10లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశాయిపేట, దూపకుంటలో లబ్ధిదారులకు త్వరలో 2,200 ఇళ్లు కేటాయించనున్నామని, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని(ఐడీఓసీ) సీఎం చేతుల మీ దుగా ప్రారంభిస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు రూ. 15వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ‘కుడా’ అధికా రులు అజిత్‌రెడ్డి, ఏఈ భరత్, కాంగ్రెస్ నేతలు గోపాల్ నవీన్ రాజ్, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, మడిపల్లి కృష్ణ, బోగి సురేశ్, దామోదర్‌యాదవ్, సాగర్ల శ్రీనివాస్, గజ్జల శ్యామ్, చందర్, వీరన్న, రాజేశ్, కత్తెరశాల శ్రీధర్ పాల్గొన్నారు.
● వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో రూ.50లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, 41వ డివిజన్ శంభునిపేట నాగమయ్య దేవాలయం ప్రాంతంలో రూ.1.10 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కరీమాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం 35వ డివిజన్ శివనగర్ వాటర్ ట్యాంక్ వద్ద చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ ప్రవీణ్‌తో కలిసి పరిశీలించారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
‘తూర్పు’లో పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపన
ఎమ్మెల్సీ సారయ్యపై
మంత్రి సురేఖ విమర్శలు
ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మమ్ముల్ని ఢీకొనడం ఎవరి చేతకాదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్సీ సారయ్యనుద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. మంత్రి తన నియోజకవర్గంలో తన అనుచరుడు ఒకరు ఎమ్మెల్సీ సారయ్య వర్గంలోకి వెళ్లడంపై స్పందించారు. బలహీనులు బలవంతుల వెనుకపడతారని, తాము బలవంతులం కాబట్టే మమ్ముల్ని ఢీకొనడం చేతక కాక మా వెనుక గోతులు తవ్వుతున్నారని ఘాటుగా విమర్శించారు. వారి అల్ప సంతోషం, ఆనందాన్ని తాము అడ్డుకోబోమని అన్నారు.


