ఏకగ్రీవం నుంచి పోటీ దిశగా ఆశాలపల్లి గ్రామం
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం నుంచి పోటీ దిశగా వెళ్లింది. గతంలో గ్రామంలో అందరికి తెలిసి ఉన్న ఎకై క ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మనే జాక్‌పాట్ సర్పంచ్ అవుతారనే ఊహాగానాలకు మంగళవారం తెరపడింది. గ్రామానికి చెందిన రాయపురం కార్తీక్ కొంతకాలం క్రితం ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రొడ్డ నవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న నవ్యశ్రీని అనూహ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీలు సంయుక్తంగా తెరపైకి తీసుకుని వచ్చి మంగళవారం నామినేషన్ దాఖలు చేయడంతో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది. దీంతో ప్రేమలో గెలిచి పెళ్లి చేసుకున్న నవ్యశ్రీ సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గి గ్రామ ప్రఽథమ పౌరురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందో లేక అధికార పార్టీ మద్దతు పొందిన కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా అదృష్టాన్ని పొందుతుందో వేచిచూడాల్సిందే.
కొంగర మల్లమ్మకు పోటీగా నామినేషన్ వేసిన ప్రేమ వివాహం చేసుకున్న యువతి


