
రిజర్వేషన్లు ఖరారు
జెడ్పీ పీఠం జనరల్‌కే..
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ శనివారం ఖరారైంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ విడుదల చేసిన బీసీ గణన నివేదిక, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను రిజర్వేషన్ల కేటాయింపునకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీటి ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను కేటాయించారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లోని నాలుగు మండలాల్లో మాత్రం ఎంపీపీలు గిరిజనులకే కేటాయించి తుది జాబితా విడుదల చేశారు.
బీసీలకు 42 శాతం
త్వరలో ఎన్నికలు జరగబోయే స్థానాలకు బీసీలకు 42 శాతం కేటాయించారు. జిల్లాలో మొత్తం 18 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ స్థానాల్లో గంగారం జనరల్, గూడూరు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. బీసీలకు ఏడు స్థానాలు కేటాయించగా ఇందులో మూడు మహిళలకు, నాలుగు జనరల్ కేటగిరీకి వచ్చాయి. ఎస్టీల్లో నాలుగు జనరల్, మూడు మహిళలకు మొత్తం ఏడు స్థానాలు, ఎస్సీ విభాగంలో ఒకటి జనరల్, మరొక స్థానం మహిళకు కేటాయించారు. అదే విధంగా 18 ఎంపీపీ స్థానాల్లో గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం నాలుగు మండలాల్లో ఏజెన్సీ నిబంధనల ప్రకారం ఎస్టీలకు కేటాంచారు. వీటితోపాటు మైదాన ప్రాంతాల్లోని ఐదు మండలాలు ఎస్టీలకు, ఆరు మండలాలు బీసీలకు, రెండు మండలాలు బీసీలకు కేటాయించారు.
నీరుగారిన
నాయకుల ఆశలు
రెండు, మూడేళ్లుగా మండల, గ్రామ జనాభాను లెక్కించుకుంటూ.. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందని భావించిన పలువురు నా యకుల ఆశలు గల్లంతైనట్లు తెలుస్తుంది. తాము అనుకున్న రిజర్వేషన్ రాకపోవడంతో ఏం చేయాలోతోచక సందిగ్ధంలో పడ్డారు.
జెడ్పీ పీఠం జనరల్ కే..
అనుకున్నట్లుగానే జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తమ మండలాలు అనుకూల రిజర్వేషన్ వస్తే చైర్మన్ పీఠం దక్కించుకోవచ్చని భావించిన పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. రిజర్వేషన్ కోసం ఎదురుచూసినా.. అనుకూలంగా రాని నాయకుల ఆశలు అడియాశలయ్యాయి.
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా..
మండలం జెడ్పీటీసీ స్థానం ఎంపీపీ స్థానం
బయ్యారం బీసీ(మహిళ) ఎస్టీ(మహిళ)
చిన్నగూడూరు ఎస్టీ(జనరల్) ఎస్టీ(జనరల్)
దంతాలపల్లి ఎస్సీ(మహిళ) ఎస్సీ(జనరల్)
డోర్నకల్ ఎస్టీ(జనరల్) బీసీ(మహిళ)
గంగారం జనరల్ ఎస్టీ(జనరల్)
గార్ల జనరల్(మహిళ) ఎస్టీ(మహిళ)
గూడూరు బీసీ(జనరల్) జనరల్
ఇనుగుర్తి ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)
కేసముద్రం ఎస్టీ(మహిళ) ఎస్టీ(జనరల్)
కొత్తగూడ బీసీ(జనరల్) ఎస్టీ(జనరల్)
కురవి ఎస్టీ(మహిళ) బీసీ(మహిళ)
మహబూబాబాద్ బీసీ(జనరల్) బీసీ(జనరల్)
మరిపెడ బీసీ(మహిళ) బీసీ(జనరల్)
నర్సింహులపేట ఎస్టీ(జనరల్) ఎస్టీ(జనరల్)
నెల్లికుదురు బీసీ(జనరల్) ఎస్సీ(మహిళ)
పెద్దవంగర ఎస్సీ(జనరల్) బీసీ(జనరల్)
సీరోలు ఎస్టీ(జనరల్) ఎస్టీ(మహిళ)
తొర్రూరు బీసీ(మహిళ) బీసీ(మహిళ)
స్థానిక సంస్థల ఎన్నికల
రిజర్వేషన్లు ప్రకటించిన అధికారులు
42శాతం బీసీలకు కేటాయింపు
ఏజెన్సీ నాలుగు మండలాల
ఎంపీపీ స్థానాలు వారికే..
అనూహ్యంగా మారిన రిజర్వేషన్లు
పలువురు నాయకుల ఆశలు గల్లంతు

రిజర్వేషన్లు ఖరారు