
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి
మహబూబాబాద్: వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ తదితరులు.. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, హార్టీకల్చర్ జిల్లా అధికారి మరియన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మహబూబాబాద్ రూరల్ : ఖైదీలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి శాలిని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షపడి.. లేదా.. బెయిల్ రానందున జైలు శిక్ష అనుభవిస్తున్న సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చదువు రానివారు చదువు నేర్చుకోవాలని చెప్పారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఒకసారి నేరం చేసి జైలుకు వస్తే మరోసారి జైలుకు రాకుండా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని తెలిపారు. సబ్ జైలు సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాస్ జైల్లో ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల ఏరు
గార్ల: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల సమీపంలోని పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు నిత్యావసరాలకోసం బయ్యారం, డోర్నకల్‌కు ఆటోల్లో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
రామప్పలో
సిరియా దేశస్తులు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని సిరియాకు చెందిన రావద్, అమీన్‌లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని వారు కొనియాడారు.
గోదావరి దోబూచులాట
వాజేడు: గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ దోబూచులాడుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు ఉధృతంగా పెరిగిన గోదావరి వరద శని వారం మధ్యాహ్నం వరకు క్రమంగా తగ్గింది. 16.410 మీటర్ల వరకు పెరిగిన గోదావరి తగ్గుముఖం పట్టి 14.920 మీటర్ల వరకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి మళ్లీ వస్తున్న నీటి ప్రవాహంతో గోదావరి వరద శనివారం సాయంత్రం 6 గంటలకు 15.140 మీటర్ల మేర పెరిగింది. దీనికి తోడు మండలంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది ఎకరాల్లోని మిర్చి పంట నీటిలోనే మునిగి ఉంది. మండల పరిధిలోని పూసూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి