
వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి
● జడ్జి అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : పారా లీగల్ వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యా య సేవా సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటీర్ల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మా ట్లాడుతూ.. చట్టాలపై సామాన్య ప్రజలకు అవగా హన లేకపోవడంతోనే మోసపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉన్న ప్రజలకి చట్టాల గురించి అవగాహన కల్పించడం న్యాయమూర్తులు లేదా న్యాయవాదులతో సాధ్యమయ్యే పనికాదని పేర్కొన్నారు. ఆయా గ్రామాల నుంచి ఆసక్తి ఉన్న వ్యక్తులను ఎంపిక చేసి పారా లీగల్ వలంటీర్లుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.షాలిని, న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్, న్యాయవాదులు యాసాడి చెన్నమల్లారెడ్డి, చిన్నమహేందర్, షేర్ స్వచ్ఛంద సంస్థ జిల్లా సమన్వయకర్త వసుంధర పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీ యమని జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నా రు. రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన సోమేశ్వరరెడ్డికి చక్రాల కుర్చీని జడ్జి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పీవీ.ప్రసాద్ మాట్లాడుతూ.. సోమేశ్వరరెడ్డికి చక్రాల కుర్చీ అందజేయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు రెడ్ క్రాస్ సొసైటీని కోరినట్లు తెలిపారు. దీంతో కుర్చీని సోమేశ్వరరెడ్డికి జిల్లా కో ర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని అందజేశారని తెలిపా రు. మాధవపెద్ది వెంకటరెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, కొండపల్లి కేశవరావు పాల్గొన్నారు.