
వృద్ధురాలి మెడ నుంచి గొలుసు అపహరణ
వరంగల్ క్రైం: సుబేదారి పీఎస్ పరిధిలోని ఎకై ్సజ్ కాలనీలో వృద్ధురాలి ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించిన ఓ దుండగుడు ఇంట్లోకి వచ్చి కాలనీకి చెందిన కొంరయ్య పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఇవ్వమన్నాడని చెప్పి ఓ టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్లినట్లు సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంటి వెనుక నుంచి డోర్ పగులగొట్టుకొని వచ్చి వృద్ధురాలు సరస్వతి మెడ నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్లినట్లు తెలిపారు. దొంగ తెల టీ షర్ట్, హెల్మెట్ ధరించినట్లు వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నట్లు సీఐ రంజిత్‌కుమార్ పేర్కొన్నారు.