
ఏటీసీలతో అధునాతన సాంకేతిక విద్య
● ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్ అర్బన్: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)తో నిరుద్యోగ యువతకు అధునాత సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అ న్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను వర్చువల్ విధానంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే మురళీనాయక్, అడిషనల్ కలెక్ట ర్ లెనిన్ వత్సల్ టొప్పొతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో యువత విద్య ఉపాధి కోసం వలసబాట పట్టారని అన్నారు. ప్రజాపాలనలో రూ.63 కోట్లతో మానుకోటలో టాటా గ్రూప్ సహకారంతో ఏటీసీ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పొ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభు త్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. బాబు, ట్రైనింగ్ ఆఫీసర్ ఉప్పలయ్య, సూపరింటెండెంట్ రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.