
పట్టుబట్టి.. కొలువు కొట్టి..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు పట్టుబట్టి.. కొలువు కొట్టారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మెరిసి అత్యుత్తమ ఉద్యోగాలు సాధించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు.
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కుడికాల వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె కుడికాల భవ్య సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో శనివారం నియామక పత్రం అందుకున్నారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ –1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో భవ్య తొమ్మిదో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు, బంధువులు అభినందనలు తెలిపారు.
డిప్యూటీ కలెక్టర్‌గా మహ్మద్ అహ్మద్ ..
దామెర : మండలంలోని ఊరుగొండకు చెందిన మహ్మద్ అహ్మద్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. మహ్మద్ చోటె–చాంద్‌బీ దంపతుల కుమారుడు మహ్మద్ అహ్మద్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ప్రస్తుతం హైదరాబాద్ వాటర్ సప్లయీ వర్క్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్–1 సాధించాలనే పట్టుదలతో కష్టపడి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై నట్లు మహ్మద్ అహ్మద్ పేర్కొన్నారు.
డీఎస్పీగా జశ్వంత్‌రాజ్..
మహబూబాబాద్ అర్బన్: గ్రూప్–1లో జిల్లా కేంద్రానికి చెందిన సంఘాల రవికుమార్, ప్రసన్న దంపతుల కుమారుడు జశ్వంత్‌రాజ్ గ్రూప్–1లో 900మార్కులకు గాను 465మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 323ర్యాంక్, మల్టీజోన్–1లో 139వ ర్యాంక్ సాధించాడు. ఈక్రమంలో హైదరాబాద్‌లో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా, రాష్ట్ర అధికారులతో డీఎస్పీగా నియాకమ పత్రం జశ్వంత్‌రాజ్ అందుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా అజ్మీ..
గూడూరు: మండల కేంద్రంలో ఐసీడీఎస్ సీడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న నీలోఫర్ అజ్మీ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2018 నుంచి గూడూరు సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న నీలోఫర్ అజ్మీ, గ్రూప్–1 ఫలితాల్లో 136ర్యాంకు సాధించి ఎకై ్సజ్ ఏఈఎస్‌గా నియమితులైనట్లు తెలిపారు. ఆమె ఎంపిక విషయం తెల్సుకున్న అంగన్‌వాడీ టీచర్లు శనివారం అభినందనలు తెలిపారు.

పట్టుబట్టి.. కొలువు కొట్టి..

పట్టుబట్టి.. కొలువు కొట్టి..

పట్టుబట్టి.. కొలువు కొట్టి..