
బీసీల పోరాటంతోనే రిజర్వేషన్ల పెంపు
● బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్
హన్మకొండ: బీసీల రిజర్వేషన్ల పెంపు సంఘటిత పోరాటం విజయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ ఇందిరానగర్‌లో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తేళ్ల సుగుణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తేళ్ల కిశోర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శా తం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ09 విడుదల చేయడం హర్షణీయమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వ చ్చిన అనంతరం కులగణన చేసి అసెంబ్లీలో చట్టం చేసిందన్నారు. తర్వాత బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ జీఓ జారీ చేసిందన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కోర్టు ద్వారా అడ్డుకోవాలని దయచేసి ఎవరూ ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, నాయకులు తమ్మేలా శోభారాణి, మాడిశెట్టి అరుంధతి, సౌమ్య, కవిత, గొట్టే మహేందర్, రవికిరణ్, దుస్సా నవీన్, మండల సమ్మయ్య ముదిరాజ్, చెప్పాల మణికంఠ, అమిత్ పాల్గొన్నారు.