
రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా పోరాడిన లక్ష్మణ్ బాపూజీ
హన్మకొండ/వరంగల్ క్రైం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా పోరాడిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం, వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కొండా లక్ష్మ ణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమం, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. నిజాం కాలంలో తెలంగాణ విముక్తికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసి మచ్చలేని నేతగా కీర్తి గడించారన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ విశిష్ట సేవలందించారన్నారు. కార్యక్రమంలో టీజీ ఎన్పీ డీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.మాధవరావు, సీజీఎం చరణ్ దాస్, క్రైం డీసీపీ గుణశేఖర్, అడిషనల్ డీసీపీలు రవి, సురేశ్ కుమార్, ప్రభాకర్‌రావు, బాలస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి,
వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

రాష్ట్ర ఏర్పాటే ఊపిరిగా పోరాడిన లక్ష్మణ్ బాపూజీ