
చెట్లు తగ్గి ధరలు పెరిగాయి..
ఏటేటా సీతాఫలాల చెట్లు తగ్గిపోతున్నాయి. దీంతో దిగుబడి పడిపోయి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. 25 ఏళ్ల నుంచి ఈ పండ్లు అమ్ముతున్నా. మా తాత, తండ్రి కాయలు, పండ్లను పబ్లిక్‌గార్డెన్ వద్ద అమ్మేటోళ్లు.. మేము బావుల దగ్గర, గుట్టల్లో కాయలను సేకరించి పండబెట్టి అమ్ముతున్నాం. ఈ సంపాదన మాకు ఆసరాగా ఉంటుంది.
– భూక్య శ్రీను, తరిగొప్పుల
మూడు నెలల పాటు ఉపాధి..
సీతాఫలాల విక్రయాలతో ఏటా మూడు నెలల పాటు ఉపాధి లభిస్తుంది. దిగుబడి తగ్గి ధర పెరిగి మాకు గిట్టు బాటు కావడం లేదు. తండాల్లో ఉన్న చెట్లకు కాసిన కాయలను సేకరించి హనుమకొండకు వచ్చి అమ్ముకుంటా. రాత్రి వరకు ఇల్లు చేరుతా. మార్కెట్‌లో అమ్మేటోళ్లు పెరిగారు. నగరం నుంచి హోల్‌సేల్ వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో ధరలు భారీగా పెరిగాయి.
బి. రాధ, పర్వతగిరి
పండు లభించడం అదృష్టం..
కూలీలు, రైతుల నుంచి నేను సీతాఫలాల కాయలను కొని విక్రయిస్తున్నా. ధర పెరిగి గిరాకీ తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి చెట్లను తొలగించి పాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. దీంతో చెట్లు అంతరిస్తున్నాయి. కొనుగోలు దారులకు ధర ఎక్కువ అనిపించినా నగరంలో పండు లభించడం అదృష్టంగా భావించాలి
దేవి, మాదాపురం, జనగామ జిల్లా

చెట్లు తగ్గి ధరలు పెరిగాయి..

చెట్లు తగ్గి ధరలు పెరిగాయి..