
8 నుంచి ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల ‘లా’ కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ శనివారం తెలిపారు. అక్టోబర్ 8న మొదటిపేపర్, 10న రెండో పేపర్, 14న మూడో పేపర్, 16న నాలుగో పేపర్, 18న ఐదో పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని వారు తెలిపారు.
9 నుంచి మూడో సెమిస్టర్
సప్లిమెంటరీ..
కేయూ ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 9వతేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం అధికారులు రాజేందర్, ఆసిం ఇక్బాల్ తెలిపారు. 9 మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు.
మోసం చేసిన వ్యక్తిపై కేసు
రామన్నపేట : ఆభరణాలు తయారు చేయడానికి బిస్కెట్ బంగారం తీసుకున్న వేదామృత జ్యువెల్లర్ నిర్వాహకుడు దుబాసి మహేశ్.. తిరిగి 75 గ్రాములు ఇవ్వకుండా మోసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ శనివారం తెలిపారు. విజయవాడ మంగళగిరికి చెందిన మంచాల రామకృష్ణ ఆభరణాలు తయారుచేసేందుకు 2024, ఆగస్టు 14న 117 గ్రాములు బిస్కెట్ బంగా రాన్ని మహేశ్‌కు అప్పగించారు. ఈక్రమంలో మధ్యలో ఒక్కసారి 15.7 గ్రాములు, మరోసారి 20.53 గ్రాముల బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేసి అప్పగించారు. మిగతా 78 గ్రాముల బంగారం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న మహేశ్‌పై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌కరుణాకర్ తెలిపారు.