
ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ ప్రాధాన్యం
హన్మకొండ: ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఆర్‌ఎం మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రమాదాలు లేని వరంగల్ రీజియన్‌గా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ, అద్దె బస్సు, జేబీఎం బస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు ఏకాగ్రతతో విధులు నిర్వహించాలంటే ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉండడంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా రు. మద్యం ముట్టుకోవద్దని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు.
ఆర్టీసీ వరంగల్
రీజినల్ మేనేజర్ డి.విజయభాను