
ిపీల్చుకు తింటున్నారు..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని ఆమాయక ఆదివాసీలు, గిరిజనుల అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వంద రూపాయలకు నెలకు వడ్డీ రూ.5నుంచి రూ. 10వరకు వసూలు చేస్తున్నారు. బంగారం, ప్లాటు, భూముల పేపర్లు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు. తీసుకున్న డబ్బులకు వడ్డీ పెరిగి తలకు మించిన భారం అవుతోంది. దీంతో బంగారం, ఇళ్లు అమ్ముకొని అప్పులు తీర్చిన వారు కొందరైతే, అప్పులు తీర్చలేక, పరువుపోతుంటే తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు మరికొందరు ఉన్నారు.
అధిక వడ్డీల వసూలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని చీటీ, ఫైనాన్స్ వ్యాపారంతోపాటు, ఇంటి వద్ద గుట్టు చప్పుడు కాకుండా అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా అప్పు తీర్చలేదని తోటి ఉద్యోగి కుటుంబ సభ్యులు వేధించడంతో కేసముద్రం మండల కేంద్రంలో ఉంటున్న రైల్వే ఉద్యోగి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ పట్టణంలోని ఓ టీషాపు నిర్వాహకుడిని అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నెల్లికుదురు మండలంలోని ఓ వడ్డీ వ్యపారి డబ్బులు ఇవ్వలేదని మహిళా ఉద్యోగిపై అసభ్యకరంగా మాట్లాడడంతో సదరు ఉద్యోగి తోటి ఉద్యోగుల వద్ద గోడు వెల్ల బుచ్చుకుని కన్నీటిపర్యంతమైంది. ఇలా వడ్డీవ్యాపారుల ఆగడాలు జిల్లాలో మితిమీరిపోతున్నాయి.
కొంతకాలం మౌనంగా..
నాలుగేళ్ల క్రితం వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అప్పటి ఎస్పీ కోటి రెడ్డి జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చీటీలు, అధిక వడ్డీలు వసూళ్లు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇలా మహబూబాబాద్ పట్టణంలో ఐదుగురు, డోర్నకల్‌లో ఇద్దరు, కేసముద్రంలో ముగ్గురు, కురవి, గార్ల, తొర్రూరు, మరిపెడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. దీంతో కొంతకాలం సద్దుమణిగిన ఈ దందా గత ఏడాది కాలంగా మళ్లీ మొదలైందని బాధితులు చెబుతున్నారు
జిల్లాలో వడ్డీ వ్యాపారుల అరాచకం
సంవత్సరాలుగా
చెల్లించినప్పటికీ తీరని అప్పు
వేధింపులు తాళలేక బాధితుల
ఆత్మహత్యాయత్నాలు
ఒకరి మృతి, మరొకరు ఆస్పత్రిలో చికిత్స
అధిక వడ్డీ వసూలు చేస్తే చర్యలు
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేయడం నేరం. వ్యాపారులు వేధింపులకు గురి చేస్తున్న విషయంపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని అప్పుల పాలుకావడం, ఆన్‌లైన్ గేమ్స్, ఇతర వ్యసనాలకు గురై కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నాం.
– తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్

ిపీల్చుకు తింటున్నారు..