
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
మహబూబాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, దశల వారీగా బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ఇళ్లను తనిఖీ చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలను సందర్శించి.. పాఠాలు బోధించి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నా రు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు బోధించారు. కార్యక్రమంలో హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ లక్ష్మినర్సింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్