అంతర పంటగా కూరగాయల సాగు | - | Sakshi
Sakshi News home page

అంతర పంటగా కూరగాయల సాగు

Jul 18 2025 1:21 PM | Updated on Jul 18 2025 1:21 PM

అంతర పంటగా  కూరగాయల సాగు

అంతర పంటగా కూరగాయల సాగు

తొర్రూరు రూరల్‌: ఆయిల్‌పామ్‌, పండ్లు, మ

ల్బరీ తోటల్లో అంతర పంటగా కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపురం, మాటేడు, అరిపిరాల గ్రామాల్లో సాగు చేస్తున్న అంతర పంటల ను పరిశీలించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. అంతర పంటగా టమాట, వంగ, క్యాబేజీ, కాలిఫ్లవర్‌, తీగజాతీ కూరగాయలు బీరకాయ, సోరకాయ, దొండకాయ, దోసకాయ వంటి పంటలకు పందిరి వేసేందుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయిల్‌పామ్‌ అధికారి రాములు, సిబ్బంది వెంకట్‌, అఖిల్‌, రంజిత్‌, ప్రకాశ్‌, ప్రసాద్‌బాబు, శరత్‌, వీరన్న పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో

62వ ర్యాంక్‌

మహబూబాబాద్‌: రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌–2024లో మానుకోట మున్సిపాలిటీ 62వ ర్యాంక్‌ సాధించినట్లు మున్సిపల్‌ పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో 50,000 నుంచి 3లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు 824 ఉండగా జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మానుకోటకు 387వ ర్యాంక్‌ వచ్చిందన్నారు. అలాగే రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉండగా 62వ ర్యాంక్‌ వచ్చి ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ సర్టిఫికెట్‌ పొందినట్లు తెలిపారు.

బాలికలు అన్ని రంగాల్లో

రాణించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గి రిజన శాఖ అధికారి దేశీరాంనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పా ఠశాలలో గురువారం వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ అనే అంశంపై శిక్షణ నిర్వహించారు.దేశీరాంనాయక్‌ మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్నారు. విద్యార్థినుల్లో నాయ కత్వ లక్షణాలు,నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఆరోగ్యం, విద్య, వృత్తి నైపుణ్యాలు, భవిష్యత్‌ ప్రణాళిక వంటి పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పొడుగు నర్సయ్య, హెచ్‌డబ్ల్యూఓ పద్మ,ఎఫ్‌సీ సుప్రజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కాయకల్ప అవార్డులు

నెహ్రూసెంటర్‌: జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్ప త్రులు కాయకల్ప అవార్డుకు ఎంపికైనట్లు డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ గురువారం తెలిపా రు. ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, అంటువ్యాధుల నియంత్రణను ప్రొత్సహించేలా భారత ప్రభుత్వం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కాయకల్ప అవార్డులు అందజేస్తుందన్నారు. కోమట్లగూడెం పీహెచ్‌సీ ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా ఎంపికై రూ. 2లక్షల బహుమతి, మరి పెడ, కురవి, కొత్తగూడ, కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి, మల్యాల, నెల్లికుదురు, బలపాల ఆరోగ్య కేంద్రాలు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. అలాగే పర్వతగిరి ఆయుష్మాన్‌కేంద్రం ఉత్తమ సెంటర్‌గా ఎంపిక కాగా, పెద్ద ముప్పారం, బయ్యారం ఆరోగ్య మందిరాలు రన్నరప్‌గా నిలిచాయని పేర్కొన్నారు. జిల్లాకు అవార్డులు రావడంతో పీహెచ్‌సీల అధికారులు, సిబ్బందిని అభినందించారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: గ్రూప్స్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్‌ రిక్రూమెంట్‌ కోర్సుల్లో 150 రోజుల ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ అ భ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ స ర్కిల్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 18నుంచి ఆ గస్టు 11వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీటీబీసీస్టడీసర్కిల్‌.సీజీజీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారి కుటుంబ ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారి కుటుంబ ఆదాయం రూ.2లక్షలకు మించి ఉండొద్దన్నారు. ఎంపికైన అ భ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున 5 నెలల పాటు స్టైఫండ్‌ మంజూరు చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 0870 2571192, 040 2407118నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement