
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
● మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామానికి చెందిన ఓ చేతి వృత్తిదారుడు తన వ్యాపారం కోసం జిల్లా కేంద్రంలోని ముగ్గురు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నా డు. ఇందుకు నూటికి రూ. 5చొప్పున వడ్డీ చెల్లించే విధంగా అంగీకారం తెలిపాడు. వడ్డీ చెల్లిస్తున్నాడే తప్ప అప్పు తీరలేదు. మళ్లీ కొంత అప్పు తీసుకొని వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. మూడేళ్లలో రూ.15లక్షలకు పెరిగింది అప్పు. దీని నుంచి బయట పడేందుకు మళ్లీ అప్పు తీసుకున్నాడు. ఈక్రమంలో వ్యాపారులు డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో ఇల్లు అమ్మి చెల్లించాడు. అవమానంతో అతడి భార్య ఉరి వేసుకొని మృతి చెందింది. గ్రామంలోనే మరోచోట అతడు చేతి వృత్తి పనులను చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నాడు.
● కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల అప్పు తీసుకొచ్చాడు. అధిక వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. చివరకు ఆ డబ్బులు కట్టలేక, మళ్లీ ఇంటి నిర్మాణానికి డబ్బు అవసరం ఉండడంతో కొన్నిచోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. అసలు కంటే వడ్డీనే ఎక్కువ కావడంతో, చివరకు గిరిగిరి కింద లక్షల్లో అప్పు తీసుకున్నాడు. రూ.50 లక్షలకు పైగా అప్పు కాగా, చేసేది ఏమీ లేక తనకున్న రెండు ప్లాట్లను రూ.47లక్షలకు అమ్మేసి అప్పు చెల్లించాడు.
న్యూస్‌రీల్