
రైతులకు అందుబాటులో యూరియా
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో రైతులకు యూరియా అందుబాటులో ఉందని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఏఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. రైతు బీమాకు సంబంధించి అర్హులైన మృతి చెందిన రైతుల వివరాలు పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై అందించిన అంశాల వివరాలు, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన మట్టి నమూనాల వివరాలు ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. మండలాల్లోని రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమీక్షలో మరిపెడ ఏడీఏ విజయచంద్ర, ఏడీఏ టెక్నికల్ మురళి, టెక్నికల్ ఏఓలు రాజు, మోహన్, విజ్ఞాన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.