
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
నెల్లికుదురు: జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కేజీబీవీలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా ఆన్‌లైన్ పాఠాలు వినిపించే అవకాశం ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేశ్, ఎంపీఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.