
పిల్లలను పంపొద్దు..
బెస్ట్ అవైలబుల్ స్కీం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచన
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లెపల్లి వెంకన్న, అతడి కుమారుడు శివరాజ్. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద శివరాజ్ తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని, రూ. 20వేల చొప్పున రెండు విడతలు రూ.40వేలు చెల్లిస్తేనే బడికి పంపించండి.. లేకపోతే వద్దు అని తేల్చి చెప్పారు. దీంతో డబ్బులు లేక.. అలాగని వేరే పాఠశాలకు పంపలేక బడి ప్రారంభం నుంచి పిల్లవాడిని ఇంటి వద్దనే ఉంచుకుంటున్నాడు. అధికారులు మాట్లాడి మా అబ్బాయిని బడికి పంపించేలా చూడాలని వెంకన్న కోరుతున్నాడు.’
తల్లిదండ్రుల సతమతం..
ప్రభుత్వ ఖర్చులతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే అవకాశం వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు సంబురపడ్డారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని పిల్ల లను బడికి పంపొద్దని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించే స్తోమత లేక పాఠశాలకు పంపించలేమని, అలాగని వేరే పాఠశాలకు పంపిస్తే చదువులు ఆగం అవుతాయని వాపోతున్నా రు. ఈ విషయంపై ఇప్పటికే రెండుమూడు సార్లు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తల్లిదండ్రులు కోరారు.
● ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే బడికి పంపాలంటున్న ప్రైవేట్ స్కూల్స్
● లేకుంటే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి
● ఇంటికే పరిమితమైన పలువురు పిల్లలు

పిల్లలను పంపొద్దు..

పిల్లలను పంపొద్దు..