
పిల్లల చదువులు ఆగం అవుతున్నాయి..
నా కుమారుడు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద మహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మారెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని సార్లు చెబుతున్నారు. పుస్తకాలు, టై, బెల్ట్, దుస్తుల కోసం రూ.7వేలు ఖర్చు అయ్యాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లించకుంటే మీరే ఇవ్వాలని అంటున్నారు. అధికారులు స్పందించి బిల్లులు ఇప్పించాలి. – కటుకూరి అనిల్, మహబూబాబాద్
మూడు సంవత్సరాలుగా బిల్లుల పెండింగ్
పేద పిల్లలకు బోధించేందుకు ముందుకు వచ్చాం. ప్రభుత్వం ప్రకటించిన డబ్బులు మూడు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు. దీంతో లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర జిల్లాలో డబ్బులు వచ్చాయి. ఈ జిల్లాలోనే రాలేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని పెండింగ్ బిల్లులు ఇప్పించాలి. – నరేశ్ రెడ్డి, అభ్యాస్ స్కూల్ చైర్మన్, తొర్రూరు