
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: రాష్ట్రంలో మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంగ్ బోడ లక్ష్మణ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం మానుకోట మండలంలోని సోమ్లాతండాలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనుల శంకుశస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. కాగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌లు నిరసన తె లిపేందుకు అక్కడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకో వడంతో జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బోడ లక్ష్మణ్, లూనావత్ అశోక్ మాట్లాడుతూ.. పాత బిల్లులు క్లియర్ చేయకుండా కొత్త పనులకు శంకుస్థాపనలు చేయడం దారుణమన్నారు. మాజీ సర్పంచ్‌ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనను అడ్డుకోవడానికి, నిరసన తెలపడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. గో బ్యాక్ భట్టి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులను మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలోమాజీ సర్పంచ్‌లు శ్యామ్, గుట్టయ్య, వెంకట్‌రెడ్డి, రామచంద్రు, దాము, సుమన్, వెంకన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్
ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో
మాజీ సర్పంచ్‌ల ఆందోళన
ఉపముఖ్యమంత్రి వద్దకు వెళ్తుండగా
అరెస్ట్ చేసిన పోలీసులు