
కష్టానికి తగ్గ ప్రతిఫలం
జయ్యారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 546 మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకునే అవకాశాన్ని పొందాను. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషశ్రీ మేడమ్, ఉపాధ్యాయుల సహకారంతో ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యా. తల్లిదండ్రులు కష్టపడి కూలీ పని చేస్తూ చదివిస్తున్నారు. వారి కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలనే లక్ష్యంతో ఇష్టంగా చదివిన. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం
– షేక్ మహిముద, జయ్యారం.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాట
మా పాఠశాల నుంచి బాసర ట్రిపుల్ ఐటీకి ఆరగురు విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతంలోని పేద కుటుంబాలకు చెందినవారే. వారికి వచ్చిన ఈ అవకాశం ఉజ్వల భవిష్యత్‌కు బాట. డీఈఓ రవీందర్‌రెడ్డి మొదటి నుంచి చక్కటి ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మమ్ముల్ని ప్రోత్సాహించారు. ట్రిపుల్ ఐటీ సెకండ్ స్పెల్‌లో కూడా మరికొంత మంది విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉంది.
– ఉషశ్రీ, ప్రధానోపాధ్యాయురాలు,
జెడ్పీహెచ్‌ఎస్ జయ్యారం

కష్టానికి తగ్గ ప్రతిఫలం