శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు

Jul 22 2025 8:33 AM | Updated on Jul 22 2025 8:33 AM

శ్రీధ

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు

వరంగల్‌ చౌరస్తా : వరంగల్‌ ఎల్‌బీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(మాసూమ్‌ అలీ)లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామన్నపేటకు చెందిన వ్యాఖ్యత, గాయకుడు ఠయ్యాల శ్రీధరాచార్యులకు జాతీయ స్థాయి భారత్‌ భూషణ్‌ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో శ్రీ గౌతమేశ్వర సాహితి కళాసేవ సంస్థ, శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కళాకారులు, ఉపాధ్యాయులు, వ్యాఖ్యాతలు ఆయనను శాలువాతో సత్కరించారు. ప్రముఖ కవి పొర్ల వేణుగోపాల రావు, సీ్త్ర అలంకరణ నిపుణులు కుంచాల లావణ్య, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్‌ గోపాల కృష్ణయ్య, సేంద్రియ వ్యవసాయ పరిశోధన నిపుణులు యాదగిరి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గుండెపోటుతో పొలంలోనే రైతు మృతి

మంగపేట : మండలంలోని బాలన్నగూడెం గ్రామానికి చెందిన రైతు తాటి లక్ష్మీనర్సు (49) తన పొలంలో ట్రాక్టరుతో దమ్ము చేయించేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలన్నగూడెం సమీపంలోని కొండాయికుంట వద్ద ఉన్న పొలంలో దమ్ము చేయించేందుకు లక్ష్మీనర్సు రెండు రోజుల నుంచి ట్రాక్టర్‌ కోసం తిరుగుతున్నాడు. అయితే తన పొలం పక్కన ఉన్న మరో రైతు పొలంలో దుక్కి చేస్తున్న ట్రాక్టర్‌తో దమ్ము చేయించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే గుండె పోటుతో తన పొలం సమీపంలో కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన మరో రైతు వచ్చి చూసేసరికి లక్ష్మీనర్సు స్పృహతప్పి పడి ఉన్నాడు. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విగత జీవిగా పడిఉన్న రైతును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

గుండ్లవాగు ప్రాజెక్టులో మృతదేహం లభ్యం

గోవిందరావుపేట : మండలంలోని గుండ్లవాగు ప్రాజెక్టులో అనుమానాస్పదస్థితితో చనిపోయిన వ్యక్తి ఆచూకీ లభ్యమైందని పస్రా ఎస్సై కమలాకర్‌ తెలిపారు. సోమవారం గుండ్లవాగులో వ్యక్తి మృతదేహం ఉన్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. వరంగల్‌ జిల్లా ఏనుమాముల గ్రామానికి చెందిన ఈసంపల్లి మణికుమార్‌ (26) ఎలక్ట్రిషీయన్‌ పని చేస్తున్నాడు. గురువారం తన తండ్రితో గొడవపడగా మందలించాడు. అనంతరం స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌ ఉందని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. శనివారం తన చెల్లెలు రాణికి ఫోన్‌ చేసి నాకు బతకాలని లేదని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని తెలిపారు. గుండ్లవాగులో లభ్యమైన మృతదేహం విషయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా తమ కుమారుడు మణికుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు1
1/3

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు2
2/3

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు3
3/3

శ్రీధరాచార్యులకు జాతీయభారత్‌ భూషణ్‌ అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement