
ఇంజనీర్ కావాలనేది నా కల
జయ్యారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన. 566 మార్కులు సాధించాను. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. మా అన్నయ్య నాకు ఆదర్శం. తను నీట్ ర్యాంక్ సాధించడానికి కష్టపడిన పద్ధతినే నేను పాటించాను. ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతిలో మంచి మార్కులతో పాటు, ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాను. ఇంజనీర్ కావాలనేది నా కల. గొప్ప చదువులు చదివి ఊరికి, పాఠశాలకి మంచి పేరు తెస్తాను.
– జాటోత్ శైలజ, మంగోరిగూడెం
ఉన్నత స్థాయికి చేరాలని..
జయ్యారం పాఠశాలలో పదో తరగతి చదువుకున్నాను. పది పరీక్ష ఫలితాల్లో 559 మార్కులు సాధించాను. జీవితంలో ఇంజనీర్ చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ చది విస్తున్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహించారు. వారి సహకారంతో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం ఆనందంగా ఉంది.
– చెవుల ఉదయ్, జయ్యారం

ఇంజనీర్ కావాలనేది నా కల