
జ్ఞానదీపం గద్దెలను తాకిన వరద..
● పొంచి ఉన్న ప్రమాదం
కాళేశ్వరం: మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద బుధవారం రాత్రి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానదీపాల గద్దెలను తాకింది. దీంతో దేవస్థాన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఒక వేళ వరద పెరిగితే ఆ రెండు జ్ఞానదీపాలు వరదల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రివేణి సంగమం సరస్వతీఘాట్ వద్ద 8.480 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. మరింత వరద పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.