
ఆలోచింపజేసిన ‘బుద్ధుడితో నా ప్రయాణం’
హన్మకొండ: బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. అఽభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో బుద్ధుడితో నా ప్రయాణం నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, లలిత ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజా, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్తమాన సమాజానికి గౌతమ బుద్ధుని బోధనల అవసరం ఉందని అన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క సుదర్శన్, పీఎస్‌ఎన్ మూర్తి, సిద్ధోజిరావు, నల్ల సూర్యప్రకాశ్, బొమ్మల్ల అంబేడ్కర్, రౌతు రమేశ్‌కుమార్, జిలకర శ్రీనివాస్, మచ్చ దేవేందర్, కొంగర జగన్‌మోహన్ పాల్గొన్నారు.