
మితంగా వాడితేనే మేలు..
పెద్దవంగర: పంటల ఎదుగుదలలో యూరియా కీలకం. ఇది పంటకు అవసరమైన నత్రజనిని అందిస్తుంది. అయితే సరైన మోతాదులో, సరైన సమయంలో వాడడం చాలా ముఖ్యం. విచక్షణారహితంగా వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాగా యూరియాను సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
యూరియా ప్రాధాన్యం..
యూరియా 46 శాతం నత్రజనిని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన రసాయనిక ఎరువు. తెల్లని గుళికల రూపంలో ఉంటుంది. నీటిలో తేలికగా కరిగి మొక్కలు ఆకులు పచ్చగా ఉండానికి, కాండం బలంగా పెరగడానికి త్వరగా అందుబాటులోకి వస్తోంది. నత్రజని లోపం ఉంటే మొక్కల ఎదుగుదల తగ్గి, దిగుబడులు తగ్గుతాయి.
యూరియా మోతాదుకు మించితే పంటలకు నష్టం
భూసారం తగ్గే ప్రమాదం
శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తే మెరుగైన దిగుబడి