
చాకలి ఐలమ్మ మునిమనువడి మృతి
పాలకుర్తి టౌన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనువడు చిట్యాల సంపత్(44) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. సంపత్ మృదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రజక వృత్తిదారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదునూరి మదార్ సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు మంజుల, సమ్మయ్య, సంధ్యారాణి, అంజమ్మ, యాకయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసుసూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి పాల్గొన్నారు.