
సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం
కేయూ క్యాంపస్: అన్ని కమిటీల సమష్టి కృషితోనే కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం విజయవంతమైందని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కేయూ సెనేట్‌హాల్‌లో వివిధ కమిటీలు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల, ఎన్‌సీసీ కేడెట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఇమేజ్ పెంపుదలకు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టబోతున్నామన్నారు. యూజీలో కూడా ఆన్‌లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టబోతున్నామన్నారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ వరంగల్ యూ ట్యూబ్ చానల్‌ను రిజిస్ట్రార్ వి. రామచంద్రంతో కలిసి ప్రారంభించారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఎన్‌సీసీ కమాండెంట్ కల్నల్ సింథిల్ ఎస్. రమాదురై, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, డీన్లు, విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.
అలరించిన ఓరుగల్లు కళాకారుల ప్రదర్శన
హన్మకొండ కల్చరల్ : రెండు రోజులుగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన శ్రీ తనికెళ్ల భరణి రంగస్థల స్వర్ణోత్సవాల్లో భాగంగా తనికెళ్ల భరణి రచనలో వరంగల్‌కు చెందిన ఓరుగల్లు శారదానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ‘చల్‌చల్ గుర్రం’ హాస్యనాటిక అలరించింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో తనికెళ్ల భరణి.. నాటిక నిర్మాత, నటుడు జేఎన్ శర్మను సన్మానించి మెమోంటో అందజేశారు. నాటిక దర్శకుడిగా సోల్జర్ షఫీ, నటీనటులుగా మహమ్మద్, కోడం సురేందర్, కుసుమ సుధాకర్, గుడివా లహరి నటించారు.
నిట్ వరంగల్‌లో
బాంబు కలకలం
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో బాంబు కలకలం సృష్టించింది. నిట్‌ను మానవ బాంబునై పేలుస్తానంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నిట్ వరంగల్‌కు చెందిన గ్రూప్‌లో మూడు రోజుల క్రితం ఈమెయిల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై యాజమాన్యం అప్రమత్తమైంది. శని, ఆదివారాలు సెలవు దినాలుకావడంతో సోమవారం తేరుకుంది. మెయిల్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి.. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో మాట్లాడి క్యాంపస్‌లోని మెయిన్ బిల్డింగ్‌తో పాటు వివిధ ప్రాంతాలను బాంబు స్వ్యాడ్‌తో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బాంబు లభించకపోవడంతో యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఫేక్ ఈమెయిల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం

సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం

సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం