
తుది దశకు సబ్ స్టేషన్ మరమ్మతు
డోర్నకల్: డోర్నకల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో జరుగుతున్న పలు మరమ్మతు పనులు తుది దశకు చేరుకున్నాయని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయేందర్‌రెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ యార్డులో జరుగుతున్న మరమ్మతు పనులను మంగళవారం ఎస్‌ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ స్టేషన్‌లో జరుగుతున్న మరమ్మతు పనులు తు ది దశకు చేరుకున్నాయని, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిరంతర విద్యుత్‌కు చర్యలు
నెహ్రూసెంటర్: నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వి ద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.విజయేందర్‌రెడ్డి మంగళవా రం తెలిపారు. వ్యవసాయ సర్వీసులు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసేలా, రైతులకు చేరువై విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో వ్యవసాయ ఎస్టిమేట్ కాపీలను తెలుగులోనే అందజేస్తున్నామన్నారు. అదే విధంగా చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు డిపార్ట్‌మెంట్ వాహనంలోనే జరుగుతుందని, దాని కోసం పది కొత్త వాహనాలు సర్కిల్ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలకు అనుగుణంగా ఎక్కువ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన పట్టణాల్లో 24 గంటలు, రూరల్ ప్రాంతాల్లో 48 గంటల్లో మార్చి విద్యుత్ సేవలను నిరంతరాయంగా అందజేస్తామన్నారు.