
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ అర్బన్: రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని, రైతు భరోసా, రుణమాఫీ, తదితర పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, సొసైటీ సీఈఓలు, పంచాయతీ కార్యదర్శులతో యూరియా, ఫర్టిలైజర్ తదితర అంశాలపై సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 7,346 మె ట్రిక్ టన్నుల యూరియా, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు. కల్తీ ఎరువులు అమ్మితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాలని సూచించారు. సొసైటీల ద్వా రా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ రైతుకు ఎరువులు పంపిణీ చేయాలన్నారు. రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా ఇతర ఫర్టిలైజర్స్ సిద్ధంగా ఉంచుకోవా లన్నారు, సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ డీఏఓ శ్రీని వాసరావు,అసిస్టెంట్ డైరెక్టర్స్ మురళి, విజయ్ చందర్, అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో