
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు
● మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్యా
వరంగల్ చౌరస్తా : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్యా హెచ్చరించారు. మంగళవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా నెలకొన్న తక్‌పట్టీల విషయంలో జరిగిన పరిణామాలు వివరించారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. వ్యాపారులు, అడ్తిదారులు, కార్మి కులు.. రైతులను సమన్వయం చేస్తూ గిట్టుబాటు ధరలు కల్పించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. సమావేశంలో గ్రేడ్–2 కార్యదర్శులు రాము, అంజిత్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ దండమల్ల రాజేందర్, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.