
మ్రానుకోటగా మార్చుదాం..
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణాన్ని మ్రానుకోటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జమాండ్లపల్లి అటవీ అర్బన్ పార్కులో బుధవారం ఎమ్మెల్యే మురళీనాయక్, డీఎఫ్‌ఓ బత్తుల విశాల్ , ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రకృతి పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు 50లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం కోసం అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. టూ రిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీ సుకువెళ్లి అటవీశాఖ అర్బన్ పార్కును అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంత రం అటవీశాఖ నిర్మించిన వాచ్ టవర్ ప్రారంభించారు. ఎఫ్‌డీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌ఓలు సురే శ్,జ్యోత్స్నదేవి, రేణుక, అధికారులు, సిబ్బంది, వివి ధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
అట్టహాసంగా వన మహోత్సవం