
గ్రంథాలయాలతో విజ్ఞానం
మహబూబాబాద్: విజ్ఞానవంతమైన సమాజానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతాయని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..గ్రంథాలయాల అభివృద్ధి అనేది గ్రంథాలయాల పన్నుపై ఆధారపడ ఉంటుందన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసినటువంటి గ్రంథాలయ పన్ను ఎప్పటికప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాలన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి అధికారుల సహకారంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత, కమిషనర్లు రాజేశ్వర్, విజయ్‌ఆనంద్, నిరంజన్, శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ సిబ్బంది రుద్రారపు వీరేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో