
రాళ్లు విసురుతూ సైకో వీరంగం
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలో బుధవారం ఓ సైకో రాళ్లు విసురుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారితో పాటు ఇళ్లలోకి చొరబడి మహిళలపై దాడిచేసి గాయపరిచాడు. అలాగే నిలిచి ఉన్న వాహనాలను ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. ఈక్రమంలో ప్రజలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హల్‌చల్ చేసిన సైకో మరిపెడ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

రాళ్లు విసురుతూ సైకో వీరంగం