
నిట్‌తో జర్మనీ యూనివర్సిటీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో జర్మనీకి చెందిన నార్దౌసెన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ మంగళవారం ఆన్‌లైన్‌లో ఎంఓయూ కుదుర్చుకుంది. వర్చువల్‌గా డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్‌యూఏఎస్ జర్మనీ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లు జాంగ్ వ్యాగ్‌నర్, జెన్నీలు పాల్గొని ఎంఓయూపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అకాడమిక్, పరిశోధనలకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని, తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఎంఓయూ చేసుకోవడం ఆనందంగా ఉందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో నిట్ డీన్లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.