
కార్మికులకు శాపంగా మారిన లేబర్‌కోడ్‌లు
నెహ్రూసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్‌కోడ్‌లు కార్మికులకు శాపంగా మారా యని ఐక్య కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీయూసీఐ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్, బి.విజయసారథి, గౌని ఐలయ్య, పాయం చిన్న చంద్రన్న, సనప పొమ్మన్న మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపును ఉపసంహరించుకొని కార్మికులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కుంట ఉపేందర్, అజయ్‌సారథిరెడ్డి, హలవత్ లింగ్యా, నాగన్న, దార స్నేహబిందు, కాంపల్లి శ్రీనివాస్, గునిగంటి రాజన్న, రామ్మూర్తి, మైస శ్రీనివాస్, సులోచన, గుజ్జు దేవేందర్, పెరుగు కుమార్, మంద శంకర్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, ఆవుల కట్టయ్య, బండపల్లి వెంకటేశ్వర్లు, చైతన్య, వీరన్న, సట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలోర్యాలీ