
పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి
విద్యారణ్యపురి: పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం హనుమకొండలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.భవిష్యత్‌లో పెన్షనర్లకు పీఆర్‌సీ, డీఏ లబ్ధిపొందే అవకాశం ఉండదన్నారు. కేంద్రప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది మార్చి నుంచి జూన్ 2025 వరకు ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగారెడ్డి మాట్లాడారు. సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా జి.రాజన్న, మహిళా ఉపాధ్యక్షులుగా ఎన్. సుభాషిణి, ప్రధాన కార్యదర్శిగా కె.దేవదాసు, సహాయ కార్యదర్శులుగా ఎం. మల్లయ్య, ఎం. దేవేందర్‌రెడ్డి, ట్రెజరర్‌గా ఎల్. గోవిందరెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఆగయ్య వ్యవహరించారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి