
‘టీ– హబ్’ను సందర్శించిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, విశ్వవిద్యాలయం రూసా నోడల్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని టీ–హబ్ కార్యాలయాన్ని సందర్శంచారు. విశ్వవిద్యాలయం తరఫున ఒప్పందానికి సంబంధించి విధివిధానాలపై చర్చించారు. టీ–హబ్‌లో అందుబాటులో ఉన్న వసతులు, వనరులు, సదుపాయాలను పరిశీలించారు. ఈ వనరుల కాకతీయ యూనివర్సిటీకి కె–హబ్ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతాయనే అంశాలను పరిశీలించారు. టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కవికృత్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌తాలుక్ పాల్గొని కె–హబ్ అభివృద్ధికి టీ–హబ్ తరుపున సహకారం ఉంటుందని తెలిపారని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.