
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదుట గల ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు బుధవారం పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సెట్విన్ అధికారులు వనజ, సత్యనారాయణరెడ్డి పరీక్షలను పర్యవేక్షించారు. యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ విజయశ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ సందర్శించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, సుమంద సోనీ, సోమ శైలజ, బొడ్డు నితీష, తదితరులు పాల్గొన్నారు.