
కంబాలపల్లి పాఠశాలకు అరుదైన అవకాశం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అరుదైన అవకాశం దక్కింది. ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఎంపికై ంది. ఈ ఏడాది మహబూబాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న పాఠశాలలు మొత్తం ఐదు కాగా, కంబాలపల్లి పాఠశాల వాటిలో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ఆధునిక రంగాల్లో విద్యను అందించడంతోపాటు భవిష్యత్‌లో తగిన కెరీర్ ఎంపిక చేసుకునే అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు 8 వారాలపాటు 10 ఆన్‌లైన్ కోర్సులు చదివే అవకాశం కలుగుతుంది. ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్, ఇతర ప్రముఖ విద్యాసంస్థల నిపుణులు రూపొందించారు.
ప్రధాన అంశాలు
● కోర్సుల వ్యవధి : 8 వారాలు (ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభం)
● పరిశీలన : ప్రతి కోర్సుకు రూ.500 మాత్రమే రుసుం
● సర్టిఫికెట్ : కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఇ–సర్టిఫికెట్ లభిస్తుంది
మరింత సమాచారం
● విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు నమోదు చేసుకోవాలి
● కోర్సు అనంతరం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తారు
● పాఠశాల తరఫున బాధ్యత వహించే విధంగా పాఠశాల (గణితం) సహాయ ఉపాధ్యాయులు కాసం శ్రీనివాసరావు ఎస్పీఓసీ (సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్)గా నియమితులయ్యారు
కోర్సుల వివరాలు
● డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం
● ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ పరిచయం
● ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ పరిచయం
● ఇంజినీరింగ్ బయాలాజికల్ సిస్టమ్స్ పరిచయం
● ఫన్ విత్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్
● లా పరిచయం
● మ్యాథ్స్ గేమ్స్ అండ్ పజిల్స్
● ఏరోస్పేస్ ఫండమెంటల్స్ వంటి మొదలైన అంశాలపై శిక్షణ
ఐఐటీ మద్రాస్ స్కూల్
కనెక్ట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం