
5కే రన్‌లో పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, అధికారులు
మహబూబాబాద్:ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ కోరారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మంగళవారం 5కే రన్ నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు బ్రహ్మాస్త్రం లాంటిదని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటింగ్‌శాతం పెంచేందుకు అధికారులు పాటుపడాలన్నా రు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్‌ఓ విశాల్, ట్రైనీ ఐపీఎస్ పండరి చేతన్, ఏఎస్పీ చెన్నయ్య, ఆర్డీఓ అలివేలు, స్వీప్ నోడల్ అధికారి మరియన్న, డీఈఓ రామారావు, కమిషనర్ నోముల రవీందర్, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి సుధాకర్ ఉన్నారు.