విద్యుదాఘాతంతో హమాలీ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో హమాలీ మృతి

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

తుగ్గలి:విద్యుదాఘాతంతో హమా లీ మృతి చెందిన ఘటన మండలంలోని ఉప్పర్లపల్లిలో మంగళవా రం చోటు చేసుకుంది. జొన్నగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎరుకల మురార్జీ కుమారుడు విక్రమ్‌ (18) రోజూ మాదిరిగానే ట్రాక్టర్‌ పనికి వెళ్లారు. ట్రాక్టర్‌లో రాళ్లు లోడ్‌ చేసుకుని గ్రామంలో ఓ ఇంటి వద్ద అన్‌లోడ్‌ చేస్తున్నారు. కొన్ని రాళ్లు కింద పడకపోవడంతో ట్రాక్టర్‌ ఎక్కి తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పైన ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడికి తండ్రి, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందండంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement