ప్రాణం తీసిన అతివేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అతివేగం

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ● బైక్‌ కారును ఢీకొట్టడంతో ప్రమాదం

● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ● బైక్‌ కారును ఢీకొట్టడంతో ప్రమాదం

ఎమ్మిగనూరు రూరల్‌: బైక్‌పై అతి వేగంతో వెళుతూ ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలైన సంఘటన సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని గుడేకల్‌కు చెందిన ఎం.ఆరోగ్య (35), అదే గ్రామానికి చెందిన హరిజన మణికుమార్‌, బంధువైన కోటేకల్‌ గ్రామానికి చెందిన హరిజన మాణిక్యరాజు స్నేహితులు. సోమవారం ఎమ్మిగనూరులో కలుసుకున్నారు. స్థానిక హోటల్లో భోజనం చేసుకొని హరిజన మాణిక్యరాజును అతని ఊర్లో వదలడానికి బైక్‌పై బయలుదేదారు. ఆదోని రోడ్డు వెంకటాపురం కాలనీ మలుపు వద్ద వేగంగా వెళ్తున్న బైక్‌ ఆదోని నుంచి మంత్రాలయం వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బైక్‌, కారు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఎం.ఆరోగ్య, మణికుమార్‌, మాణిక్యరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

ముంబైకి వెళ్లాల్సిన వ్యక్తి మృత్యుఒడికి..

గుడేకల్‌కు చెందిన ఎం.ఆరోగ్య (35), భార్య మరియమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముంబైకి వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. పది రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి ముంబైకి తిరిగి వెళ్లేందుకు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. స్నేహితులు కలవడంతో వారితో సరదాగా గడుపుదామని వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఎం.ఆరోగ్యను కర్నూలుకు తరలించగా అంబులెన్స్‌ ఆసుపత్రి ఆవరణలోకి చేరుకోగానే ఊపిరి ఆగినట్లు చెబుతూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. భర్త చనిపోయిన విషయాన్ని ముంబైలో ఉన్నా భార్యకు తెలియజేయడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆనంద్‌ మంగళవారం సాయంత్రం తెలిపారు.

మృతి చెందిన ఆరోగ్య (ఫైల్‌)

తీవ్రంగా గాయపడిన

మణికుమార్‌, మాణిక్యరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement