శ్రీశైలం: మితిమీరిన వేగం ఓ యు వకుడి పాణాన్ని బలిగొంది. వివరా ల్లోకి వెళితే.. శ్రీశైలానికి చెందిన దేశ రమేష్ శంకర్ (19) సోమవారం అర్ధరాత్రి దాటాక 1.42 నిమిషాలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి కమ్మ సత్రం ఎదురుగా తన బైక్ (ఏపీ 40 బీఎల్ 0169)పై అతివేగంగా దూసుకొచ్చి గౌడ సత్రం ఎదురుగా ఉన్న స్టాప్ గేట్‌ను గుద్దుకొని కింద పడిపోయాడు. అతని గొంతు వద్ద తీవ్ర రక్త గాయం కావడంతో స్థానికులు దేవస్థానం హాస్పిటల్‌కు తరలించగా డాక్టర్లు పరీక్షించి అతడు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాజెక్ట్ కాలనీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


