నవోదయను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు | - | Sakshi
Sakshi News home page

నవోదయను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

● ఇద్దరికి గాయాలు

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంను మంగళవారం ముగ్గురు ట్రైనీ ఐఏఎస్‌లు ప్రియాంక వధా, భరత్‌, హుసేన్‌ సందర్శించారు. విద్యాలయంలో తరగతి గదులు, కిచెన్‌ గార్డెన్‌, హాస్టల్‌ గదులు పరిశీలించి విద్యార్థుల తో మాట్లాడారు. విద్యాబోధన, వసతుల గురి ంచి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ప్రి న్సిపాల్‌ ఇ.పద్మావతి, అధ్యాపకులు ఉన్నారు.

మిర్యాలగూడలో

ప్రత్యక్షమైన జేఈ

కొలిమిగుండ్ల: విద్యుత్‌ శాఖలో జేఈగా పనిచేస్తున్న చింత లక్ష్మణస్వామి తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఈ నెల 8వ తేదీ రాత్రి కారు తీసుకొని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. తర్వాత సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, విద్యుత్‌ శాఖ సిబ్బంది ఆందోళన చెందారు. భార్య లీలావతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మణస్వామి ఫోన్‌ ద్వారా సీఐ రమేష్‌బాబుకు అందుబాటులోకి వచ్చారు. తన వ్యక్తిగత కారణాలతోనే మిర్యాలగూడకు వెళ్లినట్లు వెల్లడించారు. ఎట్టకేలకు ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సాయంతో మిర్యాలగూడ నుంచి కొలిమిగుండ్లకు సాయంత్రానికి చేరుకున్నాడు.

బావిలో మృతదేహం లభ్యం

బండిఆత్మకూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్ద దేవళాపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం ఆలయం సమీపంలోని బావిలో మృతదేహం తేలియాడుతున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించగా శిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య (56)గా తేలిందన్నారు. పుల్లయ్య రెండు రోజుల క్రితం మద్యం సేవించి మండలంలోని సంతజూటూరు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వారితో పెద్ద దేవళాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఆలయానికి వెళ్లే క్రమంలో బావికి ప్రహరీ లేకపోవడంతో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నల్లమల ఘాట్‌లో

రోడ్డు ప్రమాదం

మహానంది: వినాయకచవితి పర్వదినం కావడంతో అహోబిలం ఆలయానికి బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొనడంతో ఇద్దరు భక్తులకు గాయాలైన సంఘటన సోమవారం నల్లమల ఘాట్‌ రోడ్డులో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా పొదిలికి చెందిన శ్రీనివాసరావు, మల్లికార్జున బైక్‌పై నంద్యాల వైపు వస్తున్నారు. సర్వ నరసింహస్వామి సమీపం వద్దకు రాగానే గిద్దలూరు వైపు వెళ్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరికీ గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌ ద్వారా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన శిరివెళ్ల పరిధిలోకి రావడంతో శిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

కుక్కను తప్పించబోయి వ్యక్తి మృతి

కోడుమూరు రూరల్‌: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో ప్యాలకుర్తి – కొత్తూరు గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్‌ అదుపుతప్పడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్నూలులోని రోజా వీధికి చెందిన షేక్‌ దౌలత్‌బాషా (56) మంత్రాలయంలో సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ కర్నూలుకు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం రాత్రి కుటుంబాన్ని చూసుకునేందుకు మంత్రాలయం నుంచి కర్నూలుకు బైక్‌పై బయలుదేరాడు. ప్యాలకుర్తి –కొత్తూరు గ్రామాల మధ్య రోడ్డుపై కుక్క అకస్మాత్తుగా అడ్డం రావడంతో తప్పించే క్రమంలో బైక్‌ అదుపుతప్పి కింద పడడంతో దౌలత్‌ బాషా తలకు తీవ్రగాయలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ దౌలత్‌బాషాను స్థానికులు పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్‌కు తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు దౌలత్‌బాషాకు భార్య షాహిన్‌తో కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement