సిల్వర్‌ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

కర్నూలు సిటీ: క్లస్టర్‌ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సిల్వర్‌సెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభంమైంది. కౌన్సెలింగ్‌ను కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నాగరాజు శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్‌ 24న రాష్ట్ర స్థాయిలో సిల్వర్‌ సెట్‌ నిర్వహించామన్నారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్‌, రోస్టర్‌ విధానం అనుసరిస్తూ ఈ నెల 6వ తేదీ వరకు అన్ని సబ్జెక్టులలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బీఏ ఎకనామిక్స్‌ మేజర్‌ సీట్లు, హిస్టరీ మేజర్‌ 20 సీట్ల భర్తీకి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. బీఏ గ్రూప్‌ అడ్మిషన్లకు జరిగిన అర్హత పరీక్షలో కర్నూలు రూరల్‌ మండలం ఆర్కే దుద్యాల గ్రామానికి చెందిన ఎస్‌.వెంకట్రామిరెడ్డి కూతురు శ్రీలేఖరెడ్డి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి బీఏ ఆనర్స్‌లో అడ్మిషన్‌ పొందడం పట్ల ప్రిన్సిపాల్‌ అభినందించారు. బీఏ, హిస్టరీ, ఎకనామిక్స్‌ గ్రూప్‌లలో అన్ని సీట్లలో విద్యార్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement