దిల్‌ మ్యాంగ్‌ మోర్‌ | - | Sakshi
Sakshi News home page

దిల్‌ మ్యాంగ్‌ మోర్‌

May 31 2026 2:12 AM | Updated on May 31 2026 2:12 AM

సాధారణంగా మామిడి కాయలు గుండ్రంగా, కోలగా ఉంటాయి. లేత అకుపచ్చ రంగులో, నున్నగా మెరుస్తూ నోరూరిస్తాయి. అయితే వెంగళాం పల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తోటలో లవ్‌ షేప్‌లో కాసిన ఓ మామిడి కాయ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శనివారం కాయలు తెంపడానికి వెళ్లిన కూలీ తిమ్మప్పకు ఈ కాయ కనిపించింది. అచ్చం హృదయం ఆకారంలో ఉన్న ఈ మామిడి కాయను కూలీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాయ పెరిగే దశలో వాతావరణ ప్రభావం వల్ల మామిడి కాయలు కొన్నిసార్లు ఇలాంటి విభిన్న ఆకారంలో వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి కళ్యాణి తెలిపారు. –ప్యాపిలి

Advertisement
 
Advertisement
Advertisement